తెలంగాణకు భారీ వర్ష సూచన రోడ్లపైకి జనం రావొద్దని GHMC హెచ్చరికలు

- August 27, 2017 , by Maagulf
తెలంగాణకు భారీ వర్ష సూచన రోడ్లపైకి జనం రావొద్దని GHMC హెచ్చరికలు

హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మియాపూర్‌ నుంచి ఉప్పల్‌ వరకు... నగర శివారు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.  వర్ష బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో.. పలు కాలనీలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. అటు.. జీహెచ్ ఎంసీ విపత్తు నిర్వహణ విభాగం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, కర్మన్ ఘాట్ ప్రాంతాల్లో వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తే.. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, కుకట్ పల్లి, బీహెచ్ఈఎల్, రాంచంద్రాపురం, బషీర్ బాగ్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com