దోపిడీకి గురైన సుహాసినిమణిరత్నంల కొడుకు
- August 28, 2017
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని దంపతుల కుమారుడు నందన్ విదేశాల్లో చదువుతున్న సంగతి విధితమే.. కాగా దేశం కానీ దేశంలో చదువుతున్న నందన్ ఇటలీలో దొంగల బారిన పడ్డాడు.. దీంతో సుహాసిని స్పందిస్తూ.. తన కుమారుడు ఇటలీలోని వెనిస్ విమానాశ్రయం దగ్గర ఉన్నట్లు.. ఎవరైనా తెలిసిన వారు ఉంటే సాయం చేయాల్సిందిగా ట్విట్టర్ వేదికగా కోరారు.. ఎవరినా ఎయిర్ పోర్ట్ వద్ద ఉంటే సాయం చెయ్యడాని ప్లీజ్ మా అబ్బాయి నందన్ బెలూన్నో ప్రాంతంలో ఉండగా దోపిడీకి గురయ్యాడు..అంతేకాదు.. తన ఫోన్ నెంబర్ కు ఎవరూ ఫోన్ చేయకండి.. ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్ చాలా తక్కువగా ఉన్నది అని సుహాసిని ట్వీట్ చేశారు.. మరికొద్ది సేపటికే సుహాసిని.. నందన్ ఓ హోటల్ లో చాలా క్షేమంగా ఉన్నడని... అడిగిన వెంటనే స్పందించి సాయం అందించిన అందరికీ కృతజ్ఞతలు అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. బహుశా దీనినే కాల మహిమ అంటారేమో.. ఇక్కడేమో.. తల్లిదండ్రులు సుహాసిని మణిరత్నం లు ఎందరికో సాయం చేసే స్థితిలో ఉంటే.. అక్కడ కొడుకు నందన్ అనుకోని విధంగా ఆర్ధిక సాయం అర్ధించే విధంగా పరిస్తితి వచ్చింది.. బహుశా అందుకే పెద్దలు అంటారు.. ఏ క్షణం ఎవరికి ఎవరు అవసరమో..!! ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి చూడవద్దు అని.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







