కుండపోత వర్షాలతో ముంబై
- August 29, 2017
ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో ముంబైలో చాలా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జోగేశ్వరి, మాతుంగా వైపు వెళ్లే రైళ్లు ఆగిపోవడంతో పాటూ బాంద్రా, చర్చ్ గేట్, వెళ్లే రైలు మార్గాలపై నీళ్లు భారీగా నిలిచిపోయాయి. భారీ వర్షంతో రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో బస్తీల్లో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. మొదటే అతంతమాత్రంగా ఉన్న రోడ్లు వర్షంతో వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. సియాన్, దాదర్, ముంబై సెంట్రల్, కుర్లా, అంధేరీ, సాకినాక ప్రాంతాలను కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మరో 24 గంటలపాటు ముంబైలో వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చరించారు. గత 24 గంటలుగా శాంతాక్రజ్ అబ్జర్వేటరీ దగ్గర 88 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. పశ్చిమ తీరంలో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







