14న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు శంకుస్థాపన
- August 30, 2017
ప్రతిష్టాత్మక ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సెప్టెంబర్ 14న నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పాల్గొంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి సబర్మతీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు రూ.98,000 కోట్లతో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్ రుణంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 13న గుజరాత్‌కు చేరుకోనున్న మోదీ, అబేలు 14న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా మోదీ, అబేలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు 2023లో అందుబాటులోకి రానుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







