బాలయ్య 101వ సినిమా సందర్భంగా 101 పేద విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

- August 30, 2017 , by Maagulf
బాలయ్య 101వ సినిమా సందర్భంగా 101 పేద విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

'పైసా వసూల్‌' ప్రతిభా పురస్కారాలు
జిల్లాలో 10 మందికి రూ. 10 వేలు
చొప్పున మంజూరు... చెక్కులు పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్‌
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 101వ సినిమా 'పైసావసూల్‌' విడుదల నేపథ్యంలో ఆయన అభిమాన సంఘం నాయకుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ గౌస్‌ మోద్దీన్‌ ప్రతిభాపురస్కారాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలైన తమ అభిమానుల పిల్లల్లో 101 మంది ప్రతిభావంతులను గుర్తించి.. వారికి నగదు ప్రోత్సాహకం అందజేయాలని బాలకృష్ణ నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ చూపిన 10 మందికి పురస్కారాలు మంజూరు చేశారు. సంధ్య (అనంతపురం), భార్గవ (అనంతపురం), వినయ్‌ కుమార్‌ (తాడిపత్రి), హరీఫ్‌ (ఉరవకొండ), వెంకటకార్తిక్‌ (ధర్మవరం), అన్సిత (హిందూపురం), కమలమ్మ (హిందూపురం రూరల్‌)తోపాటు అదే హిందూపురం నియోజకవర్గంలో మరో ముగ్గురు విద్యార్ధులను ఎంపిక చేశారు.
సినిమా నిర్మాత ఆనందప్రసాద్‌ పంపిన చెక్కులను బుధవారం జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో గౌస్‌మోద్దీన్‌ ఐదుగురు విద్యార్థులకు పంపిణీ చేశారు. మిగతా ఐదుగురికీ గురువారం హిందూపురంలో అందజేయనున్నారు. ఈ సందర్భంగా గౌస్‌ మాట్లాడుతూ.. పేద విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రతిభా పురస్కారాలు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. మిగతా జిల్లాల్లో ఇద్దరుముగ్గురికి చొప్పున ఇవ్వగా.. ఇక్కడ మాత్రం 10 మందికి మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు, నిర్మాత ఆనంద ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు గోపీనాథ్‌, రాయుడు, గోపాల్‌, ఆది, రంగనాయకులు, మణిరవి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com