ఈ ఏడాది మక్కా యాత్రకు మరింత సంఖ్యలో కతర్ యాత్రికులు : ఖలేద్ అల్-ఫైసల్
- August 31, 2017
మాట్లాడుతూ మక్కా యాత్ర కోసం వచ్చిన యాత్రికుల సంఖ్య 1,752,014, ఉందని గత సంవత్సరంతో పోలిస్తే 426,263 అత్యధికులు హాజరైనట్లు మక్కా ప్రాంత ఎమిర్, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడికి మరియు సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ పేర్కొన్నారు.సౌదీ ప్రెస్ ఏజెన్సీతో బుధవారం ఆయనతో మాట్లాడుతూ గత ఏడాది ఖతారి యాత్రికులు 1,210 మంది మక్కా యాత్రకు వచ్చేరని ఈ సంవత్సరం 1,564 మంది ఖతారి యాత్రికులు చేరుకున్నారని ఆయన చెప్పారు. యాత్రికులకు సౌకర్యాలు ఏవిధంగా అమరుతున్నాయో పరిశీలించేందుకు ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ బుధవారం ముందుగా మినాకు వచ్చారు. ఈ సంవత్సరం యాత్రికుల భద్రత, మరియు వారి ఆధ్యాత్మిక ప్రయాణం కోసం 300,000 మంది పౌర మరియు సైనిక సిబ్బందిని నియమించినట్లు ఆయన ప్రకటించారు. మినాలో మక్కా గవర్నరేట్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అతిథులకు ఉత్తమమైన సేవలను అందించడానికి అల్లాహ్ యొక్క కరుణ సంరక్షణ మరియు నిరంతర సూచనలతో కొనసాగుతున్నట్లు ఆయున తెలిపారు. హజ్ కు సంబంధించిన అన్ని విషయాల్లో తన నిర్దేశితాల కోసం డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ కు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







