యూఏఈ: 1907 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- August 31, 2017 , by Maagulf
యూఏఈ: 1907 మంది ఖైదీలకు క్షమాభిక్ష

యూఏఈ నాయకత్వం 1,907 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసింది. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. సోమవారం, ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, అబుదాబీలో 803 మంది ఖైదీలకు క్షమాభిక్షను అదించారు. వైస్‌ ప్రెసిడెంట్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ 543 మంది ఖైదీలకు క్షమాభిక్షను మంగళవారం ప్రసాదించారు. షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖాసిమి 117 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించడం జరిగింది. అజ్మన్‌ రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ హుమైద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ నౌమి 92 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఫుజారియా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ హమాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ షర్కి 47 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించారు. అల్‌ ఖైమా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి 305 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్ష పొందిన వారు తిరిగి సాధారణ జీవితం గడపాలనీ, సమాజంలో భాగమై సమాజం మేలు కోసం తమవంతు కృషి చేయాలని పాలకులు, అధికారులు, సామాజిక వేత్తలు ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com