ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది బాలికల మృతి
- September 01, 2017
ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో11 మంది బాలికలు సహా 12 మంది మృత్యువాతపడ్డారు. ఇరాన్‌లోని షిరాజ్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షిరాజ్‌లో జరిగే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి 45 మంది విద్యార్థినులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అమ్మాయిలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన బాలికలను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా ఇరాన్‌లో రహదారులు బాగున్నప్పటికీ.. ట్రాఫిక్ భద్రత విషయంలో పేలవమైన రికార్డు ఉంది. డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా ప్రతి ఏడాది వేలాదిమంది ప్రమాదానికి గురవుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







