విడుదలకు సిద్ధమవుతున్న మహానుభావుడు
- September 02, 2017
డైరెక్టర్ మారుతి ..శర్వానంద్ లోని కామెడీ ఫుల్ గా వాడుకున్న ఫిల్మ్ మహానుభావుడు. ఇటీవలే రిలీజైన టీజర్ చూస్తే మారుతి క్యారెక్టరైజేషన్ దాని నుండి వచ్చిన కామెడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానుభావుడు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇటలీ, ఆస్ట్రియా, క్రొయెషియా లాంటి విదేశాల్లో మరియు పోలాచ్చి, రామోజీఫిల్మ్‌సిటి, హైదరాబాద్‌లోని అందమైన లోకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈవారం నుండి ఆడియో సింగిల్స్ విడుదల చేసి త్వరలోనే ధియేట్రికల్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







