అమెరికా లో మరల జాతి విద్వేష దాడి
- September 02, 2017
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిక్కు యువకుణ్ని ఓ అమెరికన్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ దురదృష్టకర ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి గగన్‌దీప్ సింగ్ (22) హత్యకు గురికావడం విషాదాన్ని రేపింది. యూనివర్శిటీలో అడ్మిషన్ రాలేదన్న అక్కసుతో జాకబ్ కోలెమన్ (19) టాక్సీ డ్రైవర్, సిక్ విద్యార్థిని అనేకసార్లు పొడిచి హత్యచేశారని స్థానిక పోలీసులు ప్రకటించారు.
ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సింగ్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేన్నారు.. ఈ క్రమంలో ఆగష్టు 28 న వాషింగ్టన్ లోని స్పోకేన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో నిందితుడు సింగ్ టాక్సీ ఎక్కాడు. ఇదాహోలోని బోనర్ కంట్రీలో తన స్నేహితుడు ఇంటికి వెళ్లమని కోరాడు. ఆకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు విచక్షణా రహితంగా దాడి చేయడంతో సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
గోంజాగా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రయివేట్ కాథలిక్ యూనివర్శిటీలో ప్రవేశం లభించకపోవడంతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల కథనం. అయితే ఈ విషయాన్ని యూనివర్శిటీ ఖండించింది. అలాంటి అప్లికేషన్ ఏదీ తమ దగ్గరకు రాలేదనీ, విచారణకు సహకరిస్తున్నట్టు తెలిపింది.
పంజాబ్‌లోని జంషెడ్‌పూర్‌కుచెందిన గగన్‌దీప్‌సింగ్ గా మృతుణ్ని గుర్తించారు. 2003నుంచిన ఆయన వాషింగ్‌టన్‌లో నివసిస్తున్నారు.
మరోవపు జలంధర్ కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ రాజు మేనల్లుడు గగన్ సింగ్. ఈ హత్యపై ఆయన స్పందిస్తూ, తన మేనల్లుడు జాతి విద్వేషాలకు బలైయ్యాడని ఆవేదన వ్యక‍్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై ట్రంప్ విధానాల ఫలితంగా జాతి విద్వేషాలకు బాధితులుగా భారతీయులు, ఆసియన్లు బాధితులుగా మారుతున్నారని మండిపడ్డారు.
కాగా అమెరికాలో ఇటీవలి నెలల్లో అమెరికన్లు లభారతీయలును, సిక్కులను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆందోళన రేపుతోంది. జూలైలో కాలిఫోర్నియాలో ఒకే వారం లో రెండు వేర్వేరు సంఘటనలలో ఇద్దరు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







