చైనా కు సవాళ్లు విసురుతున్న భారత్
- September 02, 2017
చైనా తాటాకు చప్పుళ్లుకు భారత్ దీటుగానే బదులిస్తోంది. మొన్న డోక్లాం సమస్య పరిష్కారం అనంతరం.. తాజాగా బ్రిక్స్ వేదికగా భారత్ ఉగ్రవాద సమస్య గురించి, ప్రత్యేకంగా పాకిస్తాన్ గురించి మాట్లాడకూడదని చైనా పంపిన సంకేతాలకు భారత్ గట్టిగానే సమాధానం చెబుతోంది. ఈ నెల 3 నుంచి 5 వరకూ చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి గట్టిగా మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపాయి. బ్రిక్స్ వేదికపై ఉగ్రవాదం, పాక్ గురించి మాట్లాడకూడదని చైనా సంకేతాలు పంపింది. అయితే గంటల వ్యవధిలో అందుకు స్పందించిన భారత్.. ప్రధాని మోదీ గట్టిగానే ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తారన్న సిగ్నల్స్‌ను బీజింగ్‌కు పంపింది.
బ్రిక్స్ సదస్సుల్లో భాగంగా ఈ నెల 4న అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్తాన్ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిక్స్ సమావేశానికి హాజరవుతున్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమావేశమవుతారా? లేదా? అన్న విషయంపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. బ్రిక్స్ సదస్సులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు పాల్గొంటారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







