తెలుగు అభిమానులకు కమల్ హాసన్ స్వరం
- April 28, 2015
ప్రముఖ నటుడు, నిర్మాత కమల్‑హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త. తెలుగు సినిమాలో తొలిసారిగా ఆయన తన గొంతు వినిపించబోతున్నారు. ఉత్తమ విలన్ తమిళ సినిమా తెలుగు వెర్షన్‑కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా మే 1వ తేదీ శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. సాధారణంగా కమల్‑హాసన్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేస్తే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇస్తారు.
'' ఉత్తమ విలన్ తెలుగు వెర్షన్‑కు కమల్ హాసన్ సర్ డబ్బింగ్ చెప్పారు. మొట్టమొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నందున, ఈ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డబ్బింగ్ పూర్తి అయిన తరువాత, నచ్చక ఆయన రెండవసారి డబ్బింగ్ చెప్పారు'' అని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి.
రమేష్ అరవింద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కమల్‑హాసన్ 8వ శతాబ్ధపు థియేటర్ కళాకారుడిగా, నేటి సూపర్ స్టార్‑గా నటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







