ఆరోగ్యానికి కొబ్బరినూనె...

- April 28, 2015 , by Maagulf
ఆరోగ్యానికి కొబ్బరినూనె...

కొబ్బరినూనె జుట్టుకి రాసుకునేందుకు మాత్రమే అనుకుంటుంటే కనుక దాని ప్రాముఖ్యతను తగ్గించినట్టే. ఎందుకంటే కొబ్బరినూనెని వంటకాల్లో చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.

  • కొబ్బరినూనెతో చేసిన వంటలు తింటే జీవక్రియలు వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనె వాడి చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి కూడా.శరీరారోగ్యాన్నే కాకుండా మానసిక ఒత్తిడినుంచీ బయటపడేస్తుంది.
  • వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. హానికారక బ్యాక్టీరియా, వైరస్ లతో  పోరాడుతుంది. యాంటీబ్యాక్టీరియా, యాంటీమైక్రోబయల్ లిపిడ్స్, క్యాప్సిక్, క్యాప్రిలిక్, లౌరిక్ ఆమ్లాలను కలిగి ఉంటుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది. డయాబెటిస్ కి ఇది మంచి మందు.
  • గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. బిపిని సమంగా ఉంచుతుంది. ఇందులో ఉండేవి శాచ్యురేటెడ్ కొవ్వులు కావడం వల్ల ఎటువంటి హాని లేదు.
  • చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేసి, ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షణ కవచంలా ఉంటుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com