వాహనదారులకు హెడ్ ఫోన్స్ అందించి ఆశ్చర్యపర్చిన అబూధాబీ పోలీసులు

- September 03, 2017 , by Maagulf
వాహనదారులకు హెడ్ ఫోన్స్ అందించి  ఆశ్చర్యపర్చిన అబూధాబీ పోలీసులు

అబుదాబి: కొందరు వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక చేతితో మొబైల్ ఫోన్ ని పట్టుకొని మరో చేత్తో వాహన స్టీరింగ్ ను పట్టుకొని నడుపుతూ పలు రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్ష కారణమవుతున్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని నిలువరించడానికి వాహనకారులకు అవగాహన పెంచడానికి అబుదాబి పోలీస్ వారు ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాల్సిన అవసరాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పలు ప్రచారాలను ప్రారంభించారు.  ఈ చర్యలలో భాగంగా పలువురు వాహనదారులకు హెడ్ ఫోన్స్ అందించి ఆశ్చర్యపర్చారు. ఈ చర్య ద్వారా ఎమిరేట్లో ట్రాఫిక్-సంబంధిత ప్రమాదాలను కొంతమేరకు తగ్గిస్తుందని తెలిపారు.అబుదాబి పోలీస్ సిబ్బంది ఇడి ట్రాఫిక్ డైరెక్టరేట్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ .బ్రిజిడియర్ అహ్మద్ అబ్దుల్లా అల్ షీహి, గస్తీ సమయంలో పలువురికి  హెడ్ఫోన్లను పంపిణీ చేశారు. ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనల ద్వారా తప్పనిసరిగా కట్టుబడి ఉండటానికి వాహనదారులకు ఆయన పిలుపునిచ్చారు. వాహనదారులు  సెల్ ఫోన్తో బిజీగా ఉండటం ఈద్ శుభాకాంక్షలను పంపడానికి మరియు కాల్స్ ని స్వీకరిసిన్చడం  లేదా సోషల్ మీడియా వెబ్సైట్లు బ్రౌజ్ చేయడం తదితర పనుల వలన వలన ట్రాఫిక్ ప్రమాదాలు జరగడం  మరియు ట్రాఫిక్ ప్రవాహాన్ని ఏర్పడటానికి కారణమవుతుంటుంది. రహదారి కంటే మొబైల్ ఫోన్ తోనే  నిమగ్నమై డ్రైవర్ దృష్టి వాహనంపై  మరచిపోవడం మరియు రోడ్డుపై అతని / ఆమె దృష్టిని మరల్చడంకు ఫోన్ ఓ ముఖ్య కారణమవుతుంది. అంతేకాక వాహనదారుడుఒక సాధారణ  సరైన వేగంతో డ్రైవ్ చేయలేకపోతున్నారు, ఒక  కారుకి ఒక కారుకి  మధ్య ఒక సురక్షిత దూరాన్ని సైతం వాహనదారులు  నిర్వహించడంలో విఫలమవుతున్నారని షిహీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com