శ్రీలంక పై భారత్ ఘన విజయం...
- September 03, 2017
కొలంబో: ఐదో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విధించిన 239 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది, ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 46.3 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16, రహానే 5, పాండే 36, జాదవ్ 63 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ ఒక పరుగు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ వీర విజృంభణ చేసి 5 వికెట్లు నేల కూల్చాడు. బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ నేల కూల్చారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ ఉపుల్ తరంగ (48), లహిరు తరిమన్నె (67), మాథ్యూస్ (55) ఆకట్టుకున్నారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







