అమెరికాలో వైఎస్సార్ వర్థంతి సభ

- September 03, 2017 , by Maagulf
అమెరికాలో వైఎస్సార్ వర్థంతి సభ

అమెరికా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి సభను సెప్టెంబర్ నెల 4వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ద లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వర్జీనియాలోని బంజారా ఇండియన్ కుసిన్ లో వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ అడ్వైజర్ కమ్ రీజనల్ ఇన్ ఛార్జ్ (మిడ్ అట్లాంటిక్) రమేష్ రెడ్డి వల్లూరు తెలిపారు.

చిరునవ్వు చెరగని ముఖం. మడత నలగని పంచె కట్టు. నేనున్నానని భరోసా కలిగించే మాటతీరు. ఆరునూరైనా మాటపై నిలబడే వ్యక్తిత్వం. ఒక్కమాటలో తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. మనిషి మరణించాక కూడా బతికే ఉండాలని నమ్మిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. డాక్టర్ వైఎస్ఆర్ మరణించి ఎనిమిదేళ్లు గడిచిన ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువు తీరాయని వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని వారు తెలిపారు.
 
పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేసిన వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో వైఎస్‌ఆర్ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఎన్నారైలు ధీమా వ్యక్తం చేశారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు బెబుతున్నారు. పరిపాలన దక్షతకు, రాజనీతిజ్ఞతకు మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వీరందరి నుంచి నేటికి దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com