ఉ.కొరియా దెబ్బకు కుప్పకూలి ఢీలా పడ్డ దేశీ, అంతర్జాతీయ మార్కెట్లు
- September 04, 2017
ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై కూడా పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే సూచనల నేపథ్యంలో.. మదుపర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్ అన్ని ఒక్కసారిగా ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఢీలా పడుతున్నాయి.
దేశీ మార్కెట్ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 9,950 దిగువకు పడిపోయింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలే ఈ పతనానికి కారణమంటున్నారు. ఆరంభ ట్రేడింగ్ నుంచే సెన్సెక్స్ నష్టాల బాట పట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 31,731 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 9,918 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.03గా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







