పిట్స్ బర్గ్‌కు చెందిన ఓ మహిళ కార్లోనే 3నెలలు ముందుగానే డెలివరీ,
- September 04, 2017
పెన్సిల్వేనియాలోని పిట్స్ బర్గ్‌కు చెందిన ఓ మహిళ మూడు నెలలు ముందుగానే బిడ్డకు జన్మనివ్వడం విస్తుగొలుపుతోంది. మూడు నెలల ముందుగానే ఆ చిన్నారి తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని బిడ్డ తల్లి స్కర్రీ చెబుతున్నారు. డెలివరీ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న స్కర్రీ.. అందులోనే బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి ఆరోజు.. జస్ట్ అలా బయటకు వెళ్లొద్దామని స్కర్రీ బయలుదేరారు. కొంచెం దూరం వెళ్లాక.. ఆమెకు కడుపు నొప్పి మొదలైంది.
సాధారణంగా వచ్చే నొప్పులే అనుకున్నప్పటికీ.. నొప్పులు అంతకంతకూ పెరగడంతో కారును ఆసుపత్రి వైపు మళ్లించారు స్కర్రీ. ఇంతలో భర్త ఇయాన్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి రావాల్సిందిగా సమాచారం అందించారు. అయితే ఆసుపత్రికి చేరే లోపే.. డ్రైవింగ్ సీటులోనే ఆమె ప్రసవించారరు. బిడ్డ ఆమె చేతిలో పడినప్పుడు రక్షణ పొరతోనే ఉన్నాడు. ఈ రక్షణ పొర తల్లి కడుపులో ఉన్నప్పుడు అటూ ఇటు కదలడానికి, ఒత్తిడి నుంచి రక్షణగా, ఆహారం, శ్వాసం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
దీనిపై స్పందించిన వైద్యులు.. ప్రతీ 80వేల కేసుల్లో ఇలాంటిది ఒకటి అరుదుగా జరుగుతుందన్నారు. కాగా, 2016లొ తొలిసారి స్కర్రీ గర్భం దాల్చింది. ఇప్పుడు 11వారాల ముందుగానే మరో బిడ్డను ప్రసవించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







