ఫేస్ బుక్ వాడండి ఉద్యోగం పట్టండి
- October 28, 2015
ఫేస్ బుక్ ను వినియోగిస్తున్న ప్రతి పది మందిలో ఒకరికి ఉద్యోగం వస్తున్నదని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఆయన బుధవారం ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారత్ లో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భారత్ లో 13 కోట్ల మంది ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారని, అత్యధిక ఫేస్ బుక్ వినియోగదారులతో భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండోస్థానంలో ఉందని చెప్పారు. భారత్ తో అనుసంధానమైతేనే ప్రపంచంతో అనుసంధానం కావచ్చునని ఆయన పేర్కొన్నారు. మరో వందకోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రౌండ్ నెక్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకొని సింపుల్ గా ఈ కార్యక్రమానికి హాజరైన జుకర్ బర్గ్.. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఉత్సాహంగా సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఆయన చెప్పిన జవాబులివి.. ప్రశ్న: మీరు ఎందుకు భారత్ పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు? నిజాయితీగా చెప్పండి జవాబు: ప్రపంచంలోని ప్రతి ఒక్కరితో అనుసంధానం కావాలన్నది మా మిషన్. భారత్ అతిపెద్ద ప్రజాస్వామిక శం. ఈ దేశంతో కనెక్ట్ అయితే తప్ప ప్రపంచంతో కనెక్ట్ కాలేం. ప్రశ్న: ప్రస్తుతం ఫేస్ బుక్ లో భారత్ నుంచి 13 కోట్ల మంది యూజర్లు ఉన్నారు సరే, మరీ ఇంటర్ నెట్ సదుపాయం లేనివారితో మీరెలా అనుసంధానం అవుతారు? జవాబు: ఇందుకోసం ఇంటర్ నెట్.ఓఆర్ జీ ద్వారా మేం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 24 దేశాల్లో ఇది ప్రారంభమై విస్తరిస్తున్నది. ఇంటర్ నెట్.ఓఆర్ జీ ద్వారా చేస్తున్న ప్రయత్నాలతో ఇప్పటికే కోటిన్నరమందికి ఇంటర్ నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సెనెగల్ లాంటి ఆఫ్రికన్ దేశాలలో కూడా ఇప్పుడు ఫేస్‌బుక్ అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







