ఆయుత చండీ యాగానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన కేసీఆర్

- October 28, 2015 , by Maagulf
ఆయుత చండీ యాగానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయుత చండీ యాగానికి రావాలని రాష్ట్రపతిని కేసీఆర్ ఆహ్వానించినట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఢిల్లీ వెళ్లే ముందు గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ కలిశారు. ఆయుత చండీయాగం కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన, సూచనలు సలహాల కోసం గవర్నర్ ను కేసీఆర్ కలిసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com