హీరోగా నిలదొక్కుకో లేకపోయిన సుమంత్
- October 28, 2015
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తరువాత హీరోగా నిలదొక్కుకో లేకపోయిన వారసుడు సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో 'సత్యం', 'గౌరి' లాంటి హిట్ సినిమాల్లో నటించినా, ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే నటుడిగా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయిన సుమంత్ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీ పై స్వయంగా ప్రకటించిన అతడు త్వరలోనే తన బ్యానర్ లో సినిమా మొదలు పెడతానని తెలిపాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో వెంకట్, నాగార్జునలు నిర్మాతలుగా మంచి విజయాలు సాధించగా, సుమంత్ సోదరి సుప్రియ కూడా నాగార్జున నిర్మించిన పలు చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే బాటలో సుమంత్ కూడా సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారాలని ప్లాన్ చేస్తున్నాడు
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







