సల్లూ భాయ్ తో విల్లన్ గా తలపడనున్న సుదీప్

- September 05, 2017 , by Maagulf
సల్లూ భాయ్ తో విల్లన్ గా తలపడనున్న సుదీప్

సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ 2012లో రిలీజై  బాక్స్ఆఫీస్  బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి టైగర్ జిందా హై టైటిల్ తో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో కూడా కత్రినానే హీరోయిన్ గా నటించడం విశేషం.  
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సల్మాన్ ఖాన్‌తో నటించే బంపర్ ఆఫర్ వచ్చింది. ఈగ సినిమాతో విలన్గా మారిన సుదీప్....  టైగర్ జిందా హై సినిమాలో కూడా విలన్ మారాబోతున్నాడు. ఈ సినిమాలో  పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం భారీ రెమ్యూరేషన్ ను సుదీప్ డిమాండ్ చేసినట్టు బీ టౌన్ టాక్. ఈ ఫిల్మ్ ను యాశ్ రాజ్ సంస్థ నిర్మిస్తుండగా...అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 22న ఈ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com