కార్న్‌ లాలిపాప్‌

- September 05, 2017 , by Maagulf
కార్న్‌ లాలిపాప్‌

కావాల్సిన పదార్థాలు
కార్న్‌ ఫ్లేక్స్‌-ఒకటిన్నర కప్పు, పన్నీర్‌-అంగుళం సైజ్‌ ఉన్న ఆరు క్యూబ్‌లు, వెల్లుల్లి-రెండు రెబ్బలు(తరిగి), అల్లం-చిన్న ముక్క (తరిగి), ఉల్లిపాయలు -పావుకప్పు (తరిగి), మిర్చి-రెండు (తరిగి), కార్న్‌స్టార్చ్‌-ముప్పావుకప్పు, బ్రెడ్‌పొడి, మైదా - ఒక్కోటి పావుకప్పు చొప్పున, నీళ్లు -అరకప్పు, ఉప్పు-తగినంత, నల్లమిరియాల పొడి-చిటికెడు, నూనె-వేగించడానికి సరిపడా.
తయారీ విధానం
కార్న్‌ ఫ్లేక్స్‌ను మిక్సీ ఆడించాలి. కడాయి వేడి చేసి రెండు టేబుల్‌ టీ స్పూన్ల నూనె వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. తరువాత ఉల్లి తరుగు వేసి మూడు నిమిషాలు వేగించాలి. అప్పుడు కార్న్‌ ఫ్లేక్స్‌ పొడి, ఉప్పు, నల్లమిరియాల పొడి వేసి స్టవ్‌ ఆపేయాలి. మిశ్రమం చల్లారాక పావుకప్పు బ్రెడ్‌పొడి వేసి మెత్తగా కలపాలి. చిన్న ఉండల మధ్యన పన్నీర్‌క్యూబ్‌లు పెట్టి లాలిపాప్‌ సైజ్‌లో చేసుకోవాలి. 
కార్న్‌స్టార్చ్‌, మైదాల్లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. తయారుచేసుకున్న లాలిపా్‌ప ముద్దలకు ఈ పేస్టును కోట్‌లా పట్టించి బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. వీటిని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేగించి పేపర్‌ టవల్‌ మీద వేయాలి. లాలిపా్‌పలు సగం చల్లారాక ఐస్‌క్రీమ్‌ పుల్లలకు గుచ్చి.. తినడమే ఆలస్యం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com