ఈద్‌ సందర్భంగా బహ్రెయిన్‌ హోటల్స్‌లో 90 శాతం ఆక్యుపెన్సీ రేట్‌

- September 05, 2017 , by Maagulf
ఈద్‌ సందర్భంగా బహ్రెయిన్‌ హోటల్స్‌లో 90 శాతం ఆక్యుపెన్సీ రేట్‌

మనామా: బహ్రెయిన్‌ హోటల్స్‌లో ఈద్‌ సందర్భంగా ఆక్యుపెన్సీ రేట్‌ 90 శాతానికి చేరుకుంది. హోటల్‌ రంగానికి సంబంధించి అధికారికంగా ఈ లెక్కలు వెల్లడయ్యాయి. ఫోర్‌ అలాగే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రిప్రెజెంటేటివ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియా మరియు జిసిసి దేశాల నుంచి ఎక్కువగా అతిథులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఈద్‌ సందర్భంగా మొత్తం 16 రోజులపాటు హోటల్స్‌ ఆక్యుపెన్సీ రేట్‌ చాలా బాగుందని హోటల్‌ రంగానికి చెందినవారు వివరించారు. అతిథుల్ని ఆకర్షించడంతోపాటుగా ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని సైతం ఈ గ్రోత్‌ ఆకర్షిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. జిసిసి టూరిస్టులకు పలు రకాలైన ఆఫర్లతో హోటళ్ళు ఆక్యుపెన్సీ రేట్‌ని పెంచుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com