డయాబెటిక్ రోగులు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు

- September 05, 2017 , by Maagulf
డయాబెటిక్ రోగులు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు

మానవ శరీరానికి అవసరమైన పోషకాలు అందించే వాటిలో కోడిగుడ్లు ఒకటి. వీటిల్లో మనకు శరీరానికి కావల్సిన పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియంలతో పాటు... శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు వంటి కీలక పోషకాలు లభ్యమవుతాయి. పైగా, ఇది మంచి బలవర్థక పదార్థంగా భావిస్తారు. అందుకే కోడిగుడ్డును ఆరగించేందుకు పెక్కుమంది ఆసక్తిచూపుతారు. అయితే, కొందరు దీన్ని మాంసాహారంగా పరిగణిస్తారు. ఇలాంటి వారు కోడిగుడ్డుకు దూరంగా ఉంటారు. 
అయితే, మధుమేహం వ్యాధిబారిన పడినవారు ఖచ్చితంగా డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. తీసుకునే ప్రతి ఆహార పదార్థాన్ని మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారి రోజుకు ఎన్ని కోడిగుడ్లను తీసుకోవచ్చనే సందేహం ప్రతి రోగికి ఉంటుంది. 
సాధారణంగా ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఎందుకంటే పచ్చ సొనను కలిపితే మనకు నిత్యం అందే డైటరీ కొలెస్ట్రాల్‌లో 55 శాతం వరకు అందుతుంది. కనుక అది మన శరీరానికి మంచి చేస్తుంది. కాబట్టి రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినవచ్చు. 
ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటర్. అయితే ఆరోగ్యవంతులెవరైనా రోజుకు ఒక కోడిగుడ్డును (పచ్చనిసొనతో కలిపి) నిర్భయంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలు అనేకం కలుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com