ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

- September 05, 2017 , by Maagulf
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతుంది. ఇంకా రెండు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొని ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా భారీవర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com