ఏడుగురు తెలంగాణ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు
- September 05, 2017
తెలంగాణ నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ''నేషనల్ అవార్డ్స్ టూ టీచర్స్-2017''కు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారికి అవార్డులను అందజేశారు. ప్రాథమిక ఉపాధ్యాయులు కిషన్ (పాతఎల్లాపూర్, నిర్మల్), కె.జనార్దన్ (శివన్నగూడ, నల్గొండ), ఎం.నారాయణ (పల్కపల్లి, నాగర్‌కర్నూల్), ఎన్.విజయలక్ష్మి (కుల్సాపూర్, నిజామాబాద్)తోపాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యోగేశ్వర్ (మంచిర్యాల), కె.సురేందర్ (జగిత్యాల), రామారావు (ఎన్కూరు, ఖమ్మం) అవార్డులను స్వీకరించారు. కేంద్ర మంత్రి ప్ర కాశ్ జవదేకర్, సహాయమంత్రులు సత్యపాల్‌సింగ్, ఉపేంద్ర కుశ్వాహా పాల్గొన్నారు. కాగా, అవార్డులు పొందిన వారు సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







