సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శన
- October 28, 2015
సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు రానుంది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నాడు దేశ రాజధానిలో జరిగే పరేడ్‌లో తెలంగాణ తరఫున సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర సమాచార- పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, ఆర్టిస్టు రమణారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క- సారలమ్మ జాతర వరంగల్ జిల్లా లో జరుగుతుందని, ఆ ఉత్సవాల ఔన్నత్యం తెలిపే శకటం ప్రదర్శనలో ఉంచితే బాగుంటుందని ఈ సమావేశంలో వీరు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు విన్నవించినట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







