క్రికెటర్ భర్తతో యాంకర్ భార్య ఇంటర్వ్యూ
- September 09, 2017
కర్ణాటక ప్రీమియర్ లీగ్ కళ తప్పింది.. ప్రధాన స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు అంతర్జాతీయ మ్యాచ్‌లో బిజీగా ఉండడంతో ఆ లీగ్‌కి ఆకర్షణ లేకుండా పోయింది. అయితే ఈవెంట్‌కు జోష్‌ను తీసుకురావాలని స్పోర్ట్స్ అథారిటీ భావించింది. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బెలగావీ పాంథర్స్ తరపున ఆడుతున్న స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేసే అవకాశం స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా ఉన్న బిన్ని భార్య మయాంతికి వచ్చింది. వివరాల్లోకి వెళితే బెంగళూరు బ్లాస్టర్స్ 19.3 ఓవర్లలో 169 పరుగులు చేసింది. ఇక్కడ స్టువర్ట్ బిన్నీ రెండు వికెట్ల తేడాతో రాణించారు. దాంతో పాంథర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్లో మజాను తీసుకువచ్చింది. ఇలా భర్తను భార్య ఇంటర్వ్యూ చేయడంపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







