హమ్మో ఇర్మా విశ్వరూపం
- September 10, 2017

ఎటుచూసిన చూడ చక్కని అందాలు, చిన్నచిన్న ద్వీపాలతో అలరారే కరీబియన్ దీవుల్లోని బహమాస్ దేశం హరికేన్ ఇర్మా ధాటికి కుదేలైంది. బహమాస్‌లో 700కు పైగా ద్వీపాలు ఉన్నాయి. సముద్ర తీరాన్ని ఆనుకుని ఎన్నో బీచ్‌లు, రిసార్ట్‌లు ఉన్నాయి. అయితే ఇర్మా విధ్వంసం అనంతరం బీచ్‌లు, రిసార్టులకు చేరువలో ఉండే సముద్రం మాయమైంది.
అది ఎంతలా అంటే కనుచూపు మేరలో సముద్రం ఉందని తెలియనంత దూరానికి అట్లాంటిక్ సముద్రం వెనక్కు వెళ్లింది. ఓ బహమాస్ వాసి ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో షాక్‌కు గురి చేయక మానదు. అయితే, కేవలం 13 గంటల్లో సముద్రం మళ్లీ తిరిగి ఆ ప్రదేశానికి వచ్చేసింది. సముద్రపు నీరు వెనక్కు వెళ్లడానికి ఓ కారణం ఉంది. హరికేన్ అత్యధిక ఒత్తిడికి గురి చేసి నీటిని తన వైపునకు లాక్కొవడం వల్లే ఇలా జరిగింది. ఇలాంటి పరిస్థితి సునామీ రాకకు ముందు సంభవిస్తుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







