దుబాయ్ లో తెలుగువారి దసరా సంబరాలు
- October 28, 2015

ఇంటర్నేషనల్ సిటీలో దుబాయ్ లో అనేక తెలుగు కుటుంబాలున్నాయి; వారు తమదైన శైలిలో అన్ని పండుగలను, సంప్రదాయిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఐకమత్యంతో జరుపుకోవడం కూడా రివాజు. ఈ విధంగా ఇటీవల జరుపుకున్నది - దసరా దేవి నవరాత్రి మహోత్సవం! ఇందులో ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక అవతారాన్ని గురించిన స్తుతులు, లలితా సహస్ర పారాయణంతో సహా జపించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దైనందిన కార్యక్రమాన్ని భజనాలతో ముగిస్తారు. గత నాలుగు సంవత్సరాలుగా 18 ఇళ్ళలో ఉదయం మరియు సాయంత్రం ఈ విధంగా జరపడం నియమంగా పెట్టుకున్నారు. నూతన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి, ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉంటుంది. సరస్వతీ పూజ (మూలపూజ) నాడు చిన్నారుల పుస్తకాలను పూజలో ఉంచి, వారితో పూజ చేయించి, వారికి విద్య ఆవశ్యకతను తెలియజేసెలా చేయడంతో బాటు, ఆ చదువుల తల్లి అనుగ్రహాన్ని పొందేలా చేస్తారు. ఇక ఇంకో అతిముఖ్యమైన అంశం - శ్రీమతి పద్మజ గారి గృహంలో ఏర్పాటు చేయబడే సామూహిక కుంకుమ పూజ. ఈ సంవత్సరం ఈ పూజలో పాల్గొన్న వారు - శ్రీమతి మంజు, శ్రీమతి లోహిట, శ్రీమతి సంధ్య, శ్రీమతి పద్మజ, శ్రీమతి పూనం, శ్రీమతి సమీరా, శ్రీమతి కల్యాణి, శ్రీమతి మాధురి, శ్రీమతి గీత, శ్రీమతి అనంత లక్ష్మి, శ్రీమతి అమృత, శ్రీమతి ఆశా, శ్రీమతి రవళి, శ్రీమతి సువర్ణ, శ్రీమతి అనిత, శ్రీమతి సౌజన్య, శ్రీమతి మాధురి,శ్రీమతి లలిత మరియు శ్రీమతి హారిక ఈ కార్యక్రమాన్ని వారి గృహములలో జరుపుకున్నరు. ఈ సందర్భంగా శ్రీమతి పద్మజ గారు మాట్లాడుతూ, ఈ విధంగా ప్రతి సంవత్సరం అందరు కలసి పండుగలు, ఉత్సవాలు నిర్వహించడంలో ముఖ్యోద్దేశం మనం అందరు దైవనుగ్రహం పొందడం మాత్రమే కాక, ఒక సాంస్కృతిక సమ్మేళనం కూడా జరగడమేనని తెలియజేశారు.





తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







