నేపాల్ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిరోహించారు
- October 28, 2015
నేపాల్ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిరోహించారు. గత నెలలో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలో బిధ్యా దేవి భండారి విజయం సాధించారు. ఇప్పటిదాకా ఆమె అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వైస్ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుల్ బహదూర్ గురుంగ్‌ను ఆమె ఓడించారు. మొత్తం 327 ఓట్లకు గాను బిధ్యాకు 214 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా బిధ్యా భండారి ఎన్నికైనట్లు పార్లమెంటరీ స్పీకర్ ఒన్సారి ఘర్తీ ప్రకటించారు. నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత బిధ్యా భండారి దేశ రెండో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అంతకుముందు దేశంలో రాజరిక పాలన కొనసాగిన విషయం తెలిసిందే. భండారి కంటే ముందు రాంభరణ్ యాదవ్ ఏడేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







