సోషల్ మీడియా లో ఫొటోస్ పెడుతున్నారా? అయితే కాస్త ఆలోచించండి
- September 10, 2017
లగ్జరీ కారుతో ఎంచక్కా ఇన్‌స్టాగ్రామ్‌లోనో, కాస్ట్‌లీ వాచ్‌తో ఫేస్‌బుక్‌లోనే కనిపిస్తే ఇక పన్ను అధికారులు తలుపు తట్టే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి నల్లధనం వెలికితీతకు పన్ను అధికారులు సోషల్ మీడియానూ జల్లెడ పట్టనున్నారు. ఆదాయ వెల్లడి, ఖర్చు పెట్టే తీరు మధ్య వ్యత్యాసాలను పసిగట్టేందుకు సోషల్ మీడియా సైట్ల నుంచి సమాచారాన్ని విశ్లేషించేందుకు పన్ను అధికారులు ‘ప్రాజెక్ట్ ఇన్‌సైట్’ను చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఇన్‌సైట్ అమలు కోసం ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలను గుర్తించి బ్లాక్ మనీ పంపిణీకి చెక్ పెట్టడంలో ఈ ప్రాజెక్టు పన్ను అధికారులకు సహకరిస్తుంది. నోట్ల రద్దు అనంతరం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పన్ను ఎగవేతలు, బ్లాక్‌మనీని గుర్తించేందుకు వర్చువల్ సమాచారాన్నివినియోగించుకుంటామని పన్ను అధికారులు తెలిపారు.వ్యక్తి ఆదాయం, ఆస్తులను పూర్తిస్ధాయిలో పరిశీలించేందుకు పాన్, ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం అనివార్యం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







