ఒమాన్ లో అరెస్ట్ కాబడిన హత్య కేసులో ప్రవాసీయుడు
- September 11, 2017
మస్కట్ : ఆసియా దేశానికి చెందిన ఓ నిందితుడు హత్య చేయడమే కాక ఆ మృతదేహాన్ని పాడుబడిన నూతిలోనికి జారవిడిచేడని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి) వెల్లడించింది, హంతకుడు తన నేరంను కప్పిపుచ్చుకునేందుకు విలాయట్ లోని మహ్దా లో ఎవరూ ఉపయోగించని బావిలోనికి చనిపోయిన శవాన్ని విసిరివేసినట్లు ఒక ఆర్ ఓ పి అధికారి తెలిపారు. విచారణ మరియు నేర పరిశోధన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన ఆల్ బరియామ్ పోలీసులు ఆ హత్య కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత వారం సెప్టెంబరు 3 వ తేదీన బాధితుని అదృశ్యం కావడం గురించి ఒక నివేదిక అందుకొన్న తర్వాత ఈ కేసుని పరిశోధించేందుకు ఒక బృందం ఏర్పడింది. ఈ నేరంతో సంబంధం ఉండొచ్చునేమోనని అనుమానంతో ఒక ఆసియా దేశానికి చెందన వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించడం జరిగిందని దాంతో ఆ అనుమానితుడు తానే ఆ హత్య చేసినట్లు అంగీకరించాడని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తేలిపారు.అనుమానితుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్నిబావి లోనికి తోసివేసినట్లు దర్యాప్తు బృందంకు తెలిపాడు. కాగా చనిపోయిన శరీరంపై కత్తులతో పొడిచినట్లు పలు గాయాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







