బహ్రైన్ లో పెట్టుబడులు పెట్టండి - ప్రధాన మంత్రి ఆహ్వానం
- October 29, 2015
బహ్రైన్ ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వారి అనుజ్ఞ అనుసారం పరిశ్రమలు, వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వశాఖ వారు 'ఇన్వెస్ట్ ఇన్ బహ్రైన్ 2015' యొక్క పదవ ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. బహ్రైన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆర్ధికాభివృద్ది బోర్డు, తమ్కీన్, ముంతలాకత్, ద గల్ఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ఇండస్ట్రియల్ కన్సల్టింగ్, ద యూ. ఎన్. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ జి. సి. సి. చాంబర్స్ వారిచే ఈ ఫోరమ్ సంయుక్తంగా ఏర్పాటుచేయబడింది. బహ్రైన్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రదర్శించడానికి మంత్రిత్వ శాఖ, GOIC మరియు ప్రపంచ బాంకు వారితో కలసి ప్రదర్శనలు ఏర్పాటు చేయనుంది. గల్ఫ్ అల్యూమినియం కౌన్సిల్, ఆ రంగంలో పెట్టుబడుల శక్తిని వివరించనుండగా, మోన్డేలేజ్- బహ్రైన్ ఇంటర్నేషనల్ ఆహార పరిశ్రమల్‌పై దృస్తీ సారించి, ఇన్వెస్ట్‌మెంట్ పార్క్ లో తన ఇటీవలి విస్తరణ పై మదుపరుల దృష్టిని ఆకర్షించనుంది. ప్రజా పనులు, మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళికా వ్యవహారాల మంత్రిత్వ శాఖ - రోడ్లు, పరిశుధ్యం మరియు భవనాల రంగంలో వ్యూహాత్మక మౌలిక అవస్థాపన ప్రోజెక్టుల అవకాశాలను విశదపరుస్తుంది. జాతీయ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఇన్వెస్ట్ ఇన్ బహ్రైన్ 2015 లో ఒక ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







