దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం
- October 29, 2015
:విజయవాడలోని సీఎం కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "నేనిక్కడ.. మీరక్కడ ఉంటే.. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని సచివాలయ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగులు హైదరాబాద్‌లో.. ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటే ప్రభుత్వ పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడతారని చంద్రబాబు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లోపు సచివాలయ ఉద్యోగులు ఆమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఉద్యోగులు అడిగినవన్నీ ఇచ్చానని, నవ్యాంధ్ర నిర్మాణానికి త్యాగాలు తప్పవని ఆయన అన్నారు. ఉద్యోగులకు రెండు చోట్ల హెచ్ఆర్ఏ ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదని ఉద్యోగులకు చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులందరికీ విజయవాడలో తాత్కాలిక బస ఏర్పాటుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







