హైదరాబాద్కు శ్రద్ధా వచ్చేసింది
- September 12, 2017
ప్ర భాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం నుంచి ఆమె సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ సాగుతోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్లపై ఓ ఫ్యాక్టరీ నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధా సెట్లో అడుగుపెట్టింది ఇప్పుడే అయినా.. వారం రోజుల నుంచీ హైదరాబాద్లోనే ఉంటోంది. స్క్రిప్టుని దగ్గర పెట్టుకొని సంభాషణలు ఎలా పలకాలో నేర్చుకొంటోందట. తెలుగులో శ్రద్దాకపూర్ నటిస్తున్న తొలి చిత్రం ఇది. కాబట్టి తెలుగు భాషపై పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు మాస్టారునీ నియమించుకొందట. యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.20 కోట్లపైచిలుకు బడ్జెట్ కేటాయించారట. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు







