దయచేసి సహాయాన్ని రాజకీయం చేయవొద్దు: లారెన్స్
- September 12, 2017
ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని ఓ ప్రకటన చేశారు. తాను రాజకీయాల గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించలేదని తాను ముని 4 సినిమా పూజ కోసం తిరుపతి కి వెళ్ళి వచ్చానని ఆయన తెలిపారు.. శ్రీవారి దర్శనం తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ముని 4 సినిమా గురించి, తన తల్లికి కట్టించిన గుడి, సేవ, అధ్యాత్మిక విషయాలపై మాత్రమే సమాధానం చెప్పాను.. ఇక నీట్ పై తాను ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. ఆ వ్యాఖ్యలను రాజకీయం చేయవద్దని ఆయాన కోరారు. నీట్ ద్వారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతున్నందుకు ఆత్మహత్య చేసుకొన్న వైద్య విద్యార్ధిని అనిత కుటుంబాన్ని లారెన్స్ పరామర్శించారు. ఆ సమయంలో నేను ఆ కుటుంబానికి రూ.15 లక్షలు ఆర్ధిక సాయం అందించానా..? లేదా..? అనేది నాకు అనిత కుటుంబానికి మధ్య జరిగిన విషయం.. నాకు, ఆ దేవుడికి, అనిత కుటుంబానికి తెలిస్తే చాలు అని లారెన్స్ వ్యాఖ్యానించారు. అంతేకాని ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు.. నాకు ఎటువంటి రాజకీయాలపై ఆసక్తి లేదు.. అని లారెన్స్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







