సంగీత దర్శకుడు 'శ్రీ' జయంతి స్పెషల్
- September 13, 2017
టాలెంట్ ఉంటే చాలు దూసుకెళ్లిపోడానికి అంటారు చాలా మంది. వారసత్వం ఉంటే చాలు పని గడిచిపోతుందంటారు ఇంకొంత మంది. ఈ రెండు మాటల్లోనూ సత్యం ఉంది. కానీ అది పాక్షికం మాత్రమే. ఆ విషయం అర్ధం కావాలంటే సంగీత దర్శకుడు శ్రీ కెరీర్ లోకి ఓ సారి తొంగి చూడాలి. ప్రతిభ, వారసత్వం.. రెండూ ఉన్నా.. ఆ స్థాయిలో రాణించలేకపోయిన శ్రీ జయంతి ఇవాళ. అంతులేని ప్రతిభ ఉన్నా అర్థాంతరంగా కన్నుమూసిన శ్రీ సినిమా కెరీర్ ను ఇవాల్టి ఫేవరెట్ ఫైవ్ లో చూద్దాం..
ఇళయరాజా ఇప్పుడు వెయ్యి సినిమాల రికార్డు నెలకొల్పారుగానీ...ఈ రికార్టు ఓ తెలుగువాడి పేరుతో ఉండాల్సింది. ఆ ప్రతిభావంతుడు మరెవరో కాదు కొమ్మినేని చక్రవర్తి. తొమ్మిది వందల చిత్రాలకు పైగా సంగీతం అందించిన చక్రవర్తి కుమారుడే శ్రీ. తండ్రి వారసత్వంలో సంగీత దర్శకుడైన శ్రీ కి గుర్తింపు తెచ్చింది మాత్రం అతని టాలెంటే.
శ్రీ ఇండస్ట్రీలోకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చేనాటికి చక్రవర్తి స్వచ్చందంగానే సినిమా సంగీతానికి దూరంగా ఉంటున్నారు. తెలుగు తెర మీద కొత్త తరహా దర్శకులు పుట్టుకొచ్చిన సందర్భమూ అదే. సరిగ్గా అలాంటి సయమంలో ఎంట్రీ ఇచ్చాడు శ్రీ. తనదైన పద్దతిలో కొనసాగాడు తప్ప ఎక్కడా తండ్రి ప్రభావం అతని మీద కనిపించలేదు. ఇది అప్పుడప్పుడే తెలుగు సినిమా లెక్కలు మారుస్తోన్న రామ్ గోపాల్ వర్మ గాంగ్ కు నచ్చింది. తమలాగే సినిమా మీద పాషన్ తో ఉన్న సంగీత దర్శకుడుగా శ్రీని వాళ్లు గుర్తించారు. వాళ్లకే అద్భుతమైన సాంగ్స్ చేసిచ్చాడు శ్రీ.
సినిమా విజయం మీద హీరో ప్రభావం ఉన్నంతగా సంగీత దర్శకుడిది ఉండడం లేదనేది శ్రీ ప్రధాన కంప్లైంటు. తను కూడా పెద్ద హీరోలతో పనిచేశాడు. అయితే అది కేవలం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. అమ్మోరు టైమ్ లో శ్రీతో ఏర్పడ్డ అనుబంధంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంజి సినిమాకు అవకాశం ఇచ్చారు. అయితే అందులో ఒకే ఒక్క పాట మాత్రమే శ్రీ కంపోజ్ చేశాడు. గోల్కొండ ఫోర్టులో రమ్యకృష్ణ, చిరంజీవిల మీద చిత్రీకరించిన చికుచికు పోరీ పాట తనే పాడాడు కూడా.
తండ్రి చక్రవర్తిలాగానే శ్రీలోనూ బహుముఖ ప్రజ్ఞ ఉంది. తను కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు...అద్భుతమైన గాయకుడు కూడా. సంగీత దర్శకుడుగా తను ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వేళల్లో కృష్ణవంశీ కోరి తన చక్రం చిత్రం కోసం ఓ పాట పాడించుకున్నారు. సీతారామశాస్త్రి సాహిత్య స్ఫూర్తిని తన గాత్రంలో అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు శ్రీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







