హాస్యనటుడు ఇప్పుడు శోకసంద్రంలో
- October 29, 2015
తమిళంలో ఆయన హాస్యమంటే పడి చచ్చే వాళ్లు చాలామంది ఉన్నారు..హీరో పక్కన స్నేహితుడిగా..అన్నగా,బావగా,మామగా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో లీనమై నవ్విస్తాడు ప్రముఖ హాస్యనటుడు వివేక్. కమెడియన్ వివేక్ 1987లో విడుదలైన తమిళ చిత్రం మనదిల్ ఉర్ది వెన్దుమ్ ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. కొన్ని వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల హీరో సూర్యతో కలసి పోలీస్ గా యుముడు, సింగం 2 చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ కి అమ్రుత నందిని, తేజస్విని అనే ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు ప్రసన్నకుమార్. తమిళంలో స్టార్ కమెడియన్ అయిన వివేక్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయన మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. ఆలాంటి హాస్యనటుడు ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయాడు.. అల్లారు ముద్దగా పెంచుకున్న కొడుకు అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. 13 సంవత్సరాల వయస్సుగల ఈ కుర్రాడు డెంగ్యూ జ్వరంతో చెన్నై మరణించారు. ప్రసన్న కుమార్ గత రోజులుగా డెంగ్యూ జ్వరంతో చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నాడు. ఉదయం తీవ్రంగా మారడంతో తుదిశ్వాస విడిచాడు. 13 ఏళ్ళ వయసు గల ప్రసన్న కుమార్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమట అందుకే కొంత కాలంగా మ్యూజిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక వివేక్ కుమారుడు ప్రసన్న కుమార్ మృతి పట్ల తెలుగు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వివేక్ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కోరుతూ అభిమానులు ఉదయం నుంచి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీహెరాల్డ్.కామ్ ప్రార్థిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







