మదిని మీటిన వర్షం-పార్ట్-1

- October 29, 2015 , by Maagulf

అపుడు బాగా ఎండవానలు కలిసి జనంపై విజృంభించేస్తున్నాయ్.. ఇలాంటి టైంలో మా "అభి"గాడి పెల్లి అని కబురొచ్చింది పెల్లి ఇస్కపాలెం అనే చిన్న ఊరిలో.. ఇంకేముంది ఎగేస్కోని ఏటవతల ఇస్కపాలెం ఎర్ర బస్సు ఎక్కి బయల్దేరా.. ఓ వైపు చేపల కంపు ఇంకోవైపు గతుకుల రోడ్డు పైనేమో సూరిడు సూదులు గుచ్చి ఓల్లంత గుల్ల.. మొత్తానికి సాయంత్రం అయింది... సూరీడు పోయి వానయ్యని పంపినట్టు డమ డమా అని ఉరుములతో వాన మొదలైంది.. ఎదో ఢాం అని దూరంగా పిడుగుపడిన శబ్ధం పిడుగనుకున్న ఖాదు పగిలింది బస్సు టైరు.. ఇంకముంది ఐదు కిలోమీటర్ల కాలినడక ప్రయాణం అని తెలిసింది.. కాల్లీడ్చుకుంటూ కాలు కదిపా ఇంతలో ఓకడు భయ్యా రోడ్డెమ్మెట అయితే ఐదు కిలోమీటర్లు షార్ట్ కట్లో అయితే ఓకటిన్నర కిలోమీటర్లు అన్నారు.. ఇంకేముంది సాఫ్టువేరోడికి షార్ట్ కట్ అంటే పిచ్చి కదా.. షార్ట్ కట్ లో ఇటే బెటర్ అని కదిలా.. నడక మొదలెట్టా చిన్న గుట్టలు పెద్ద గుట్టలు దాటుకుంటూ ఓక గుట్ట దాటగానే ఓక దగ్గర అంతా బురదతో నిండి ఉంది ప్యాంటిప్పి బుజానేసుకుని బురదలో నడిచా మొత్తానికి బురద దాటగానే అభిగాడి పెల్లి జరిగే ఊరికి చేరా.. ఊరి జనాలు వింతగా చూస్తున్నారు.. రాత్రి 11.00 అయింది చూడక ఏం చేస్తారు అంతలా వెలిగిపోతుందిగా మొహం.. ఇంకా నయం దొంగోడని దంచికొట్లా మొత్తానికి ముక్కి మూలిగి అభి గాడి విడిదింటికి చేరా.. అక్కడ రాజు వచ్చినాడు అని సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే హూ లెట్ ది డాగ్ సౌండ్ అని ప్లే అయింది... ఎవరైనా హౌ అని పలకరిస్తారని చూస్తుంటే కుక్కలు మాత్రం భౌ భౌ అని గట్టిగా పలకరిస్తున్నాయ్.. ఇంతలో హౌ అని అభీగాడు వచ్చి పలకరించాడు.. అబ్బా మొత్తానికి రూం చేరుకొని బాత్రూమ్ లో చెలరేగిపోయా.. బాత్రూమ్ లోంచి నీల్లు మురిక్కాలవ నీల్లలా వస్తున్నాయ్.. ఇంతలో "భరత్ గారు" అని సన్నని స్వరం.. టవల్ మీద బయటకొచ్చా ఎవరో అమ్మాయి మిమ్మల్ని తినడానికి రమ్మంటున్నారండి అంది.. అమ్మాయి ముఖం చూసేలోపే తుర్రుపిట్ట తుర్రుమంది.. అప్పటికే కడుపులో ఎలకలు కాదు పందికొక్కులు పరిగెడుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం ఆయుధాలుతో సంబంధం లేక యుద్ధానికి బయల్దేరా.. పల్లెం మీద పడి కుమ్మేస్తున్నా వాల్లకి మాత్రం అర్థం అయినట్టుంది ఇదేదొ వరదల్లో తప్పిపోయొచ్చిన బ్యాచ్ అని అయినా ఓకరితో మనకు సంబంధం ఏంటి అని లాగించేస్తున్నా.. ఇంతలో గల్ గల్ అని గజ్జెలు చప్పుడు పెరుగెయ్యనా అంటూ సన్నని స్వరం వెయ్యమన్నాను.. నేను అమ్మాయిని చూద్దాం అనుకున్నా కానీ అందరిలో చూడడానికి కొంచెం సిగ్గు చూడలేదు కాని అమ్మాయి దగ్గర మాత్రం సుగందపూల వాసన ఆ వాసనకు మత్తెక్కిపోతుంది మది అమ్మాయి అక్కడనుండి వెల్లి పోయింది.. తిన్నాక చిన్నగా ఫ్రెండ్స్ అందరూ ఉన్న రూం కి వెల్లాను గ్యాంగ్ మొత్తం ఫూల్ బిజి మందుపార్టీలో సర్లే అని "అభి"గాడి దగ్గరకు వెల్లా ఉదయాన్నే పెల్లి అని వాడు నేను నిద్రపోవాలిరా అన్నాడు.. సరే అని గుడ్ నైట్ చెప్పి మేడ మీదకి వెల్లా.. జామురాతిరి వెన్నెలమ్మ అని స్లో మోషన్ లో మంచి బీట్ వినపడుతుంది పాటను ఎంజాయ్ చేస్తూ చందమామను చూస్తూ పక్కనున్న చుక్కలను చూస్తూ ఉన్నా ఇంతలో 
సినిమా ఎఫెక్ట్ గాలులు, మనసులో ఇళయరాజా సంగీతం, ఏదో జరగబోతోంది కుడి కన్ను కూడా టప టప టప మని కొట్టెసుకుంటోంది …
చల్లని గాలి, అందమైన వెన్నెల దూరంలో చెరువు, పంట పొలాలు... ఛా కవిని అయిన కాకపోతినే ఈ అందాలను వర్ణించగా.. కనీసం ఫోటో తీసి ఈ అందాల్ని కాప్చర్ చేద్దాం అనుకుంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టి మరిచిపోయి వచ్చా కిందకిపోయి తెచ్చుకునే ఓపిక లేక చూస్తూ నిలపడ్డాను .. అలా చూస్తున్న నా వెనక గజ్జెలు, గాజుల శబ్దం ఎవరో వెళ్తున్నారు .. కళ్ళు షివరింగ్, గుండె ఫాస్ట్ గా కొట్టింగ్గ్ దేవుడా వచ్చి వచ్చి దయ్యం దగ్గర ఇరుక్కుపోయాన అని భయం వేసింగ్ నవ రంధ్రాలలో నుంచి ఊపిరి పోతున్న ఫీలింగ్ అంజేనేయ స్తోత్రం చదువుతూ వెనక తిరిగా .. పసుపు పచ్చ వోణి పరికిణి లో ఒక అమ్మాయి అటు సైడ్ తిరిగి నిలపడి ఉంది… హమ్మయ్యా భయం పోయింది సొల్లు కార్చడం మొదలయింది నా మనసు .. ఒక రెండు నిమిషాలు అలా చూస్తూ ఉన్న ఆ అమ్మాయిలో ఏ స్పందన లేదు కొంప తీసి దయ్యమా అని మల్లి భయం స్టార్ట్ అయింది మెల్లగా అడుగులో అడుగులేస్తూ దగ్గరికి వెళ్లి వేలితో టచ్ చేశా అంతే తను కేక పెట్టింది.. ఆ అరుపుకి, తిరిగిన స్పీడ్ కి ఒక్కసారిగా దూరం పారిపోయి కింద పడ్డాను... దయ్యం కాదు అందమైన అమ్మాయి తన గుండెల మీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని బయపడుతోంది తను కూడా దయ్యం వచ్చిందేమో అని బయపడింది అనుకుంట ... ఎంత అందంగా ఉంది అంటే అలా చూస్తూ ఉండి పోయాను.. తను మెల్లగా కళ్ళు తెరిచి చూసింది నన్ను... ఆ కళ్ళు మొహం రూపు అధ్బుతహ.. మా ఆత్మ రాముడు ఘోష్ట స్టార్ట్ "కుందనపు బొమ్మలాగ తను ఉంది దిష్టి బొమ్మకు సున్నం వేసినట్టు నువ్వు ఉన్నావు నీకు అవసరమా రా తను ఎదవ అని" తిట్టడం స్టార్ట్ చేసింది … జనరల్ గా నల్లగా ఉండే వాళ్ళకు అయిన సరే వాళ్ళ మనసు అయిన "నువ్వు హీరో లాగ ఉన్నావు బాబాయ్ కుమ్మేయి అని ఎంకరేజ్ చేస్తుంది … ఏంటో నా ఆత్మ రాముడు ఎప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడుతూ ఉంటాడు నేను ఎంత బాగున్న … మెల్లగా దగ్గరికి వెళ్లి భయపడకండి నేను మనిషినే అని చెప్పుకున్న …
తను మెల్లగా ఒక చిరునవ్వు నవ్వి సారీ చెప్పింది నేను సారీ చెప్పి … నా పేరు భరత్ అని చెప్పా తన పేరు వర్ష అంట… పేరు వినగానే వర్షం లో తడిసినంతగా మొద్దు బారి పోయింది …. ఇంతలో నా కాలి మీద నుంచి ఒక ఎలుక పోయింది అంతే నేను గావు కేక పెట్టి భయపడి చిన్న స్టూల్ లాంటి దాని పైన ఎగిరి నిలపడ్డాను … నేను భయపడటం చూసి తను నవ్వుతు ఉంది ఏదో సన్నాయి రాగం వింటున్న ఎద్దు మాదిరిగా తల స్లో మోషన్ లో ఊగుతా ఉంది మాటలు వినపడటం లేదు గాల్లో తెలుతునట్టు ఉంది …. "కార్చిన సొల్లు చాలు అని" ఆత్మ రాముడి ఘోషతో ఈ లోకంలోకి వచ్చి సిగ్గుతో తల దించుకొని ఎం చెయ్యాలో అర్థం కాక చిన్నగా నవ్వుతు నిలపడ్డాను … ఊర్లు పేర్లు పరిచయాలు చదువులు ఉద్యోగాల వివరాలు తను అడక్కుండానే చెప్పేసాను మళ్లీ ఆత్మ రాముడు ఘోష చాలు ఆపు బేయ్ అని .. తను ఊరు పేరు చెప్పి, తను అంతల నవ్వి చాల రోజులు అయింది అని థాంక్స్ చెప్పింది .. ఇంకా గుడ్ నైట్ చెప్పి బయల్దేరింది కాని డోర్ ఓపెన్ కావడం లేదు.. ఇదే ఛాన్స్ నా బలప్రదర్శన చేయొచ్చు అని స్టైల్ గా నడుచుకుంటూ పోయి డోర్ ఓపెన్ చేసేకి ట్రై చేశా అవతలి నుంచి ఎవరో మహానుభావుడు గొళ్ళెం పెట్టాడు .. ఫుల్ కుష్ సంతోష పడుతూ పొద్దున్నే వాడికో ఫుల్ బాటిల్ కొట్టించాలి .. కాల్ చేసి ఫ్రెండ్స్ ని పిలుద్దాం అంటే మొబైల్ లేదు .. తనని కాల్ చేయమని చెప్పను తన దగ్గర మొబైల్ లేదు చుట్టూ చూసాను ఎవరు కనపడలేదు ఇంకా చేసేది ఏమి లేక ఒక చాప లాంటిది పడి ఉంటే దాన్ని పరిచి కూర్చున్నం చెప్పడం మరిచిపోయా ఇందాక పెరుగు వేసేప్పుడు వచ్చిన సుగందపూల వాసన మల్లి వచ్చింది…

 

--భారత్ కుమార్(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com