ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్‌కి శంకుస్థాపన
- September 14, 2017
ఎట్టకేలకు ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు కోసం గురువారం ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిజోఅబేలు శంకుస్థాపన చేశారు. రిమోట్ ద్వారా వీరిద్దరూ పనులకు శ్రీకారంచుట్టారు. వచ్చే ఏడాది నుంచి నిర్మాణం మొదలుపెట్టి 2022 నాటికి ఫినిష్ చేయాలన్నది మోదీ ఆలోచన. 508 కిలోమీటర్ల మేరా ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు 1.10 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా! 468 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ మార్గం కాగా, 27 కిలోమీటర్ల మేరా భూగర్భ టన్నెల్.. సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల నిర్మాణం జరగనుంది. సింపుల్‌గా కొంతభాగం సముద్రగర్భంలో నుంచి రైలు వెళ్లనుంది. ఇక గంటలకు 350 కిలోమీటర్ల వేగంగా పరుగులు పెట్టనుంది.
ఈ ప్రాజెక్టుకు 1.10 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా! ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, రోడ్డు, విమాన, రైలు, జల రవాణా ద్వారా దేశం మొత్తం అనుసంధానం అవుతుందన్నారు. అమెరికాలో కూడా రైల్వే వ్యవస్థ వచ్చాకే అభివృద్ధి చెందిందన్నారు. 1964లోనే జపాన్‌లో బుల్లెట్ ట్రైన్ మొదలైందని, హైస్పీడ్ రవాణా వ్యవస్థ ద్వారా ఆర్థిక ప్రగతికి మార్గం సుగమం అవుతుందన్నారు మోదీ.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







