'జిమ్మి కీ కమ్మల్' ఓనం డాన్స్

- September 14, 2017 , by Maagulf
'జిమ్మి కీ కమ్మల్' ఓనం డాన్స్

ఓనం సందర్భంగా  కొచ్చిలోని కళాశాల విద్యార్థులు చేసిన డాన్స్‌ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.  కొన్ని గంటల్లోనే కోటీ 18 లక్షల మంది వ్యూయర్ షిప్‌ని చేరుకుంది. కొచ్చిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ కాలేజ్‌కి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి, ఓనం సంప్రదాయ దుస్తులు ధరించి డాన్స్ చేశారు.  ఈ డాన్స్ యువతకు బాగా నచ్చేసింది. ఓనం పండుగకి సంబంధించి ఏదైనా భిన్నంగా రూపొందించాలని వచ్చిన ఆలోచనకి ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుం కట్టి జిమ్మికి కమ్మల్ డాన్స్ రూపొందించారు.  ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు అద్భుతమంటూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా 'సెరిల్' అనే అమ్మాయి చేసిన భంగిమలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 'సెరిల్' కాలేజ్‌లో చేరి రెండు వారాలే అయిందట. ఈ సందర్భంగా సెరిల్ మాట్లాడుతూ మా డాన్స్‌కి ఇంత మంచి స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదంటోంది.  తమిళ సినిమాలంటే చాలా ఇష్టమంటూనే అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  హాలీవుడ్ నటుడు 'జిమ్మీ కిమ్మిల్'  ఈ వీడియో చూసి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com