తన చిన్నప్పటి జ్ఞాపకాలతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

- September 14, 2017 , by Maagulf
తన చిన్నప్పటి జ్ఞాపకాలతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తన సినిమాల ప్రమోషన్స్ కోసం.. ఇతరులను తిట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు తన వ్యక్తి గత విషయాలను ప్రస్తావించలేదు.. ఒకసారి మాత్రం తాను, తన కూతురు ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన వర్మ.. తాజాగా తన తల్లి సూర్యమ్మ తో కలిసి చిన్నతనంలో దిగిన ఫోటోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.. ఈ ఫోటోకి "అందమైన మహిళ మా అమ్మ.. అమ్మ పక్కన జోకర్ లా కనిపిస్తున్నది నేనే" తనదైన స్టైల్ లో కామెంట్స్ కూడా జత చేశారు.. కాగా తాజాగా వర్మ అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో అరెస్ట్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com