కతార్ లోని భారతీయ రాయబార కార్యాలయం లో 240 మరణాలు, 3,432 ఫిర్యాదుల నమోదు
- October 29, 2015
భారతీయ రాయబార కార్యాలయం, తమ శ్రామిక మరియు సాంఘిక సంక్షేమ విభాగం వారి గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 3432 ఫిర్యాదులు, మరణాలు 240 నమోదు కాగా; కార్యాలయంలో నమోదైన మరణాలు 27 అని; గత సంవత్సరంలో ఈ సంఖ్య 279 అని 'ఓపెన్ హౌస్' కార్యక్రమంలో భారత రాయబారి - శ్రీ సంజీవ్ అరోరా, డేప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ -అర్.కె. సింగ్ తెలిపారు. కార్యాలయ అధికారులు సెంట్రల్ జైలును, బహిష్కృత కేంద్రాన్ని తరచూ సందర్శించి, అక్కడి భారతీయ ఖైదీల బాగోగులు చూస్తూనే ఉంటారని ఆయన తెలిపారు. బహిష్కృత కేంద్రo లో ఉన్న భారత జాతీయులనుండి కతార్ అధికారులకు అందిన విజ్ఞప్తుల మేరకు, ఈ నెలలో రాయబార కార్యాలయం 19 ఎమర్జెన్సీ సర్టిఫికేట్ లను, 26 విమాన్ ప్రయాణ టికెట్లను జారీ చేసింది.కార్యాలయం సహాయసహకారాలతో భారతీయ శ్రామికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థ 'భారతీయ సాంఘిక సానుభూతి వేదిక' అధ్యక్షులు - ఆరవింద్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







