మధ్యప్రాచ్యంలో ఆపిల్ మొట్టమొదటి ఔట్లెట్ యూ. ఎ.ఈ. లో ప్రారంభం
- October 29, 2015
ప్రపంచంలోనే మార్కెట్ విలువ పరంగా అతి పెద్దదైన, అమెరికాకు చెందిన నంబర్ 1 సాంకేతిక సంస్థ - ఆపిల్, మధ్యప్రాచ్యంలో తమ మొదటి రెండు స్టోర్లను ఈ గురువారం, దుబాయి మరియు అబుధాబీలలో కిక్కిరిసిన సందర్శకుల మధ్య ప్రారంభించింది. గత సంవత్సరం 63 శాతం అభివృద్ధిని నమోదు చేసి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి దూసుకుపోతోంది. ఈ కార్యక్రమానికి హాజరవడానికి మస్కట్ నుండి 400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన ఒమాని మహ్మూద్ జావేద్ వంటి అనేక మంది ఖాతాదారులు మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్ యొక్క రెండవ అంతస్టులోని ఈ కొత్త స్టోర్ బయట అనేకమంది పడిగాపులు కాసారు. తొమ్మిది మిలియన్ల విదేశీయులతో సహా, పది మిలియన్ల జనాభా గల ఈ దేశం, నిజమైన అంతర్జాతీయ వాణిజ్య మరియు పర్యాటక స్థలంగా మారిందని, ఇక్కడ ఇప్పటి వరకు ఆపిల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, వారి స్వంత ఔట్ లేట్ ఇదే ప్రధమమని, వారు ప్రపంచమంతటా విజయం సాధించినట్టే ఇక్కడ కూడా విజయం సాధిస్తారని జావేద్ ఆకాంక్షించారు. ఇక అబుధాబీ రాజధాని లోని ఫార్ములా 1 సర్క్యూట్ లోని ఎస్ ఐలండ్ లో కూడా ఒక స్టోర్ ప్రారంభమయింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







