యూఎస్ లో తెలుగు వైద్యుడి హత్య

- September 14, 2017 , by Maagulf
యూఎస్ లో తెలుగు వైద్యుడి హత్య

అమెరికాలోని కాన్సాస్ లో ఈస్ట్‌ విచితలోని క్లినిక్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్‌ అచ్యుత్‌ రెడ్డి హత్యకు గురయ్యారు. అచ్యుత్‌ రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మిర్యాల గూడలోని సీతారాంపురం. భారత కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున దుండగుడి దాడిలో కత్తిపోట్లకు గురై ఆయన మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధంచి ఉమర్‌ రషీద్‌ దత్(21) అనే అనుమానితున్ని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.

‌అచ్యుత్‌ రెడ్డి ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేశారు. 1989 నుంచి విచితలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో సైకిడాట్రిస్ట్‌గా కొనసాగుతూనే విచితలో హోలిస్టిక్ సైకియాట్రిక్ సర్వీసెస్ ను నడుపుతున్నారు. స్థానిక మీడియా, విచిత పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) సెంట్రల్‌, ఎడ్జ్‌మూర్‌లో క్లినిక్‌ దగ్గర అచ్యుత్‌ రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. డాక్టర్‌ మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం కొద్ది సమయంలోనే ఉమర్‌ రషీద్‌ దత్ అనే అనుమానితున్ని విచితలోని కంట్రీక్లబ్‌ దగ్గర గుర్తించారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, అనుమానితుడు... అచ్యుత్‌ రెడ్డితో మాట్లాడుతూనే హఠాత్తుగా కత్తితో పలుమార్లు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ‌అచ్యుత్‌ రెడ్డికి భార్య బీనారెడ్డి, ముగ్గురు పిల్లలు...రాధ, లక్ష్మీ, విష్ణులు ఉన్నారు. తల్లిదండ్రులు భద్రారెడ్డి, పారిజాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com