సెప్టెంబర్ 30వ తేదీన లండన్ కు చంద్రబాబు మరియు రాజమౌళి
- September 15, 2017
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని లండన్ తీసుకువెళ్లేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారుల బృందం సెప్టెంబర్ 30వ తేదీన రాజమౌళిని లండన్ తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న పలు ముఖ్యమైన కట్టడాల డిజైన్స్ కోసం లండన్‌లోని ఫేమస్ ఆర్కిటెక్ట్స్ నార్మన్ ఫోస్టర్ సహాయం తీసుకుంటున్నారు. తాజాగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ అయిన అనంతరం పలు కార్యాలయాల నిర్మాణంలో మరిన్ని హంగులు, అత్యాధునిక డిజైన్స్ అవసరం అని భావించిన సీఎం చంద్రబాబు.. ఈ నెలాఖరున రాజమౌళిని లండన్‌కి వెంట తీసుకెళ్లి అక్కడ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. గతంలోనూ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాజమౌళి పలుసార్లు సీఆర్డీఏ అధికారులతో భేటీ సలహాలు, సూచనలు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







