రోహింగ్యా శరణార్థులకు అండగా ఉంటాం: సుష్మా
- September 15, 2017
రోహింగ్యా శరణార్థుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రోహింగ్యా వలసల విషయంపై ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సుష్మాస్వరాజ్ ఫోన్‌లో మాట్లాడారు. శరణార్థులను వెనక్కి పిలిపించాల్సిందిగా మయన్మార్‌పై ఒత్తిడి తీసుకొస్తామని సుష్మా చెప్పినట్లు హసీనా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 25 నుంచి బంగ్లాదేశ్‌కు దాదాపు 3లక్షల మందికి పైగా రోహింగ్యాలు వలసలుగా వచ్చారు. ఇప్పటికే ఆ దేశంలో మూడు లక్షల మంది శరణార్థులు నివసిస్తున్నారు.
'మయన్మార్ నుంచి వస్తున్న శరణార్థుల వివాదంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుష్మా స్వరాజ్ మా ప్రధానమంత్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. రోహింగ్యాలు బంగ్లా రాకుండా మయన్మార్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి వారిని వెనక్కి పిలిచేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకొస్తాం' అని సుష్మా చెప్పినట్లు హసీనా డిప్యూటీ ప్రెస్ కార్యదర్శి నజ్రుల్ ఇస్లామ్ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే బంగ్లాలో ఉన్న రోహింగ్యాల కోసం భారత్ 53టన్నుల సహాయ సామాగ్రినిపంపించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







