బనియాస్ బ్రిడ్జ్‌పై ఆ బస్సుల నిషేధం
- September 16, 2017
బనియాస్ బ్రిడ్స్పై నుంచి కార్మికుల బస్సులు ప్రయాణించడాన్ని నిషేధిస్తున్నట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి బనియాస్ బ్రిడ్జిపై కార్మికుల్ని తరలించే బస్సులపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ బ్రిడ్జిపై ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కల్నల్ సలీమ్ అబ్దుల్లా బిన్ బారక్ అల్ ధధెరి చెప్పారు. బనియా బ్రిడ్జిపై కార్మికుల బస్సులను బ్యాన్ చేసిన నేపథ్యంలో కార్మికుల్ని తరలించే బస్సుల్ని నడిపే డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘించి కార్మికుల్ని తరలించే బస్సుల్ని బనియా బ్రిడ్జిపైకి తీసుకొస్తే, 1000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







